‘ఖైదీ నెం. 150’ వంద రోజులు ఆడిందా? ఆడించారా?

Posted April 21, 2017 at 11:41

chiranjeevi khaidi no 150 movie completed 100 days
మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం. 150’ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. భారీ సంఖ్య థియేటర్లలో ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుత కాలంలో ఒక సినిమా రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువ నడిచే పరిస్థితి లేదు. మొదటి రెండు వారాల్లోనే సాధ్యమైనంతగా కలెక్షన్స్‌ను దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మూడు వారాలు ఒక సినిమా ప్రదర్శింపడ్డది అంటే అదో పెద్ద భారీ విజయంగా చెప్పుకోవచ్చు. అయితే ‘ఖైదీ నెం.150’ సినిమా ఏకంగా 100 రోజులు అత్యధిక థియేటర్లలో ఆడటం జరిగింది.

మెగా ఫ్యామిలీ అంటే రికార్డులకు పెట్టింది పేరు. అందుకే ఖైదీ పేరున కూడా భారీ రికార్డు ఒకటి ఉండాలనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్‌ అండ్‌ కో ఖర్చు చేసి మరీ ఖైదీని 100 రోజులు ఆడేలా చేశారు అనే టాక్‌ వినిపస్తుంది. నందమూరి హీరోలు కూడా గతంలో పలు సార్లు రికార్డుల కోసం ఇలా చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఎక్కువ థియేటర్ల రికార్డును ఏ ఒక్కరు ఆశించడం లేదు. కాని మెగాస్టార్‌ కోసం అల్లు అరవింద్‌ దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసి రికార్డును క్రియేట్‌ చేశాడంటూ విమర్శలు వస్తున్నాయి. పలు థియేటర్లలో వంద రోజులకు ముందు సినిమాను రీ రిలీజ్‌ చేశారు. అది ఎలా లెక్క ఉంటుందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే రికార్డులు వచ్చినప్పుడు ఇలాంటి విమర్శలు, ఆరోపణలు చాలా కామన్‌ అని మెగా ఫ్యాన్స్‌ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.