త్రివిక్రమ్ తో మెగాస్టార్ 151వ సినిమా?

Posted December 5, 2016

chiru 151 movie director trivikram srinivas
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా చివరిదశకు వచ్చేసింది. సంక్రాంతికి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే చిరు తర్వాతి సినిమాపై చర్చ మొదలైంది. మెగాస్టార్ తర్వాతి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి వస్తుందా? అని ఫిల్మ్ నగర్ లో జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. బోయపాటి శ్రీను, డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ రేసులో ఉన్నారని సమాచారం.

బోయపాటి శ్రీను ఇప్పటికే చిరుకు కథ వినిపించారట. అంతా ఒకే అయినా ఎందుకనో కాస్త సినిమా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయట. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ కు ఛాన్స్ ఇచ్చారని సమాచారం. త్రివిక్రమ్ అయితేనే బెటరని మెగాస్టార్ కూడా అనుకుంటున్నారట. స్టోరీ లైన్ కూడా ఫైనల్ అయిపోయిందని సమాచారం. ఇక మిగిలింది షూటింగ్ ప్రారంభం కావడమేనని టాక్.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ అంటే ఊహించడానికే ఎగ్జయిటింగ్ గా ఉంది. దీనికి ప్రొడ్యూసర్ కూడా ఫైనల్ అయిపోయారట. అది మరెవరో కాదు అశ్వినీదత్ అని తెలుస్తోంది. ఒకరు మాటలతో గారడి చేసి మాంత్రికుడు.. మరొకరు ప్రేక్షకులను అలరించే మెగాస్టార్. ఇంకొకరు మెగా ప్రొడ్యూసర్. ఈ ముగ్గురూ కలిస్తే సినీ అభిమానులకు పండుగే. ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమన్న అంచనాలు మొదలయ్యాయి.