వర్మకు మెగా పంచ్ ఇచ్చిన చిరు కూతురు..

Posted February 3, 2017

chiru daughter susmitha commenting rgvసోషల్ మీడియాలో  ప్రతి చిన్న విషయంపైనా కామెంట్లు చేస్తూ… ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం రామ్ గోపాల్ వర్మకు బాగా అలవాటు. ఆ కామెంట్లను కొంతమంది సపోర్ట్ చేస్తే మరి కొందరు వ్యతిరేకిస్తుంటారు. అయితే మరి కొందరు మాత్రం చాలా ఫన్నీ కామెంట్లని నవ్వుకుంటుంటారట. ఆ మరి కొందరు ఎవరో తెలుసా… మెగా ఫ్యామిలీ వాళ్లు. ఈ విషయాన్ని స్వయంగా చిరు పెద్ద కూతురు సుస్మితే చెప్పింది.

రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్లను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, లంచ్ బ్రేక్ లో మాట్లాడుకోవడానికి తప్ప ఆ కామెంట్లు ఎందుకూ పనికి రావని సుస్మిత ఓ ఇంటర్ వ్యూ లో తెలిపింది. ఖాళీ సమయంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని, చాలా ఫన్నీగా ఉంటాయని చెప్పుకొచ్చింది.  ఒకరు మాట్లాడే మాటలను మనం ఆపలేమని, ఎందుకంటే ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉందని తెలిపింది. అయితే పూర్తిగా నెగెటివ్ గా మాట్లాడే వారిని సోషల్ మీడియా నుంచి బ్లాక్ చేయాలని సుస్మిత సూచించింది. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసే  వర్మ ఈ కామెంట్ల గురించి ఎటువంటి ట్వీట్లు వదులుతాడో చూడాలి.