కాంగ్రెస్ కి చిరు కూరలో కరివేప?

0
121

 Posted October 29, 2016

chiru value down in congress party
కాంగ్రెస్ పార్టీలో అవసరం ఉంటే ఎలా ఉంటుందో …లేదంటే ఎలా ఉంటుందో చెప్పేందుకు మెగా స్టార్ చిరంజీవి ఎపిసోడ్ తాజా ఉదాహరణ ఒకప్పుడు ఆయన్ని ఆకర్షించడానికి కాంగ్రెస్ ఏమి చేసిందో చూసాం. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి అప్పటి రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోనీ స్వయంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు .చిరు ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానం పలికారు. మధ్యలో ఓ సారి అయన పార్టీ మారతారని వార్తలు వస్తే ..రాహుల్ ఆయనతో మాట్లాడారని వార్తలు వచ్చాయి .ఇప్పుడు రెండు రోజులుగా చిరు టీడీపీ లో చేరొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది .కాంగ్రెస్ ప్రస్తుతం పరిస్థితికి ఉలిక్కిపడాలి .వెంటనే చిరుని బుజ్జగించాలి .కానీ ఆ పని ఈసారి చేసిందెవరో తెలుసా? చిరు చెబితేపదవి దక్కించుకున్న సి .రామచంద్రయ్య.అయనస్వయంగా నేను చిరంజీవితో మాట్లాడాను ..అలాంటిదేమీ లేదన్నారని ప్రకటన ఇచ్చారు .దీన్ని బట్టి చుస్తే చిరు విలువ తగ్గిందా ?రామచంద్రయ్య విలువ పెరిగిందా ?రెండు కాదు కాంగ్రెస్ కి చిరుతో అవసరం తీరినట్టుంది .ఎందుకలా అనిపించొచ్చు .కానీ కొన్ని విషయాల్ని విశ్లేషిస్తే ఆ రీజన్ తేలిగ్గా అర్ధమవుతుంది .

2019 ఎన్నికలకి వైసీపీ తో జట్టు కట్టేందుకు సిద్దమవుతున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్టే పావులు కదుపుతోంది.సహజంగానే జగన్ తన స్థాయిలో ప్రజాదరణ కలిగిన నేతను ఒకే వేదిక మీద మీద భరించలేరు.అదే విషయాన్ని కాంగ్రెస్ కి రాయబారం పంపి ఉండొచ్చు .దానికి తగ్గట్టే కాంగ్రెస్ కూడా చిరుని కూరలో కరివేపాకులా చూసి ఉండొచ్చు .లేకుంటే ఇప్పటికైనా చిరు గౌరవానికి భంగం కలగని రీతిలో ఉన్నత స్థాయి ప్రకటన చేయాలి .ఇంత జరుగుతున్నా చిరు కాంగ్రెస్ ని వీడేది లేదని చెప్పడం లేదంటేనే అంతర్గతంగా ఏమి జరిగిందో..ఏమి జరుగుతుందో …అర్ధం చేసుకోవచ్చు .