చిరు vs బాలయ్య…

  chiru vs balayya

చిరంజీవి, బాలకృష్ణ గత రెండు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీపడుతూనే ఉన్నారు. ఒక్కోసారి ఒక్కోరిదీ గెలుపు.. ఓవరాల్ గా చిరు ది పై చేయి అయినా చాలా సందర్భాల్లో తనదైన స్టైల్ తో బాలయ్య కూడా గట్టి పోటీనే ఇచ్చారు. చిరంజీవి రాజకీయాల వైపు వెళ్లినా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూనే అన్నారు. చిరు 150 వ సినిమా కోసం మళ్ళీ మొహానికి మేకప్ వేసుకున్నారు. అదే సమయంలో బాలయ్య 100 వ సినిమా కూడా షూటింగ్ జరుపుకోంటోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఆ ఫైట్ అక్కడితో ఆగిపోయేలా లేదు. ఆ తర్వాత సినిమాకి కూడా కంటిన్యూ అయ్యే అవకాశంముంది.

చిరు 151,బాలయ్య 101 సినిమాలు కూడా ఒకే టైం లో మొదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కానీ ఆ రెండు సినిమాలకు ఒకే డైరెక్టర్ పేరు విన్పిస్తుండటం విశేషం.. ఆ ఒక్కరు మీరెవరో కాదు బోయపాటి శ్రీను, బాలయ్యతో సింహ,లెజెండ్ లాంటి భారీహిట్ లు కొట్టిన బోయపాటి మీద మెగా క్యాంప్ కన్నేసింది. బాలయ్య 100 వ సినిమా బాక్సాఫీస్ అయినపుడు బోయపాటి 101 అయినా తీస్తానన్నారు. ఇంతలో సరైనోడు హిట్ కావడంతో అల్లు అరవింద్ బోయపాటి డైరెక్షన్లో చిరు తో సినిమా తీయాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇపుడు బోయపాటి ఎవరి వైపు మొగ్గుతాడో చూడాలి..