ఆంధ్ర రోమ్ లో క్రిస్మస్ వేడుకలు…

Posted December 12, 2016

christmas celebrations in andhra romeక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని విజయవాడ వేత్రాసన పీఠాధిపతి (బిషప్‌) తెలగతోటి జోసఫ్‌ రాజారావు అన్నారు ఆంధ్రారోమ్‌గా ప్రసిద్ధి చెందుతున్న ఫిరంగిపురంలోని బాలయేసు దేవాలయంలో క్రీస్తు జయంతి వేడుకల, జెండా ప్రతిష్ట మహోత్సం ఘనంగా నిర్వహించారు. బిషఫ్‌ రాజారావు మాట్లాడుతూ ప్రేమ ,కరుణ, దయ గుణాలతో తోటి వారిని ఆదుకుంటూ క్రీస్తు బోధనలను పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జెండాను ఆవిష్కరించి దివ్యపూజాబలి సమర్పించారు. చర్చి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోషే ప్రవక్త, పునీత అంతోని, పునీత ఇన్యాసి, పునీత చిన్నతేరేజమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు