ఎమ్మెల్యేల ఇంటి పెళ్ళికి సినీ సెట్టింగ్..

Posted February 13, 2017

cine setting for mlas son marriage
ఏపీ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు వియ్యంకులు కాబోతున్న విషయం తెలిసిందే.వినుకొండ ఎమ్మెల్యే జీవీజీ ఆంజనేయులు,పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ల మధ్య స్నేహం బంధుత్వంగా మారుతున్న విషయం తెలిసిందే.ఆంజనేయులు కుమార్తె సౌజన్య,శ్రీధర్ కుమారుడు సాయి సుధాకర్ ల పెళ్లి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.హైదరాబాద్ లో నవంబర్ 24 న నిశ్చితార్ధం జరగ్గా తాజాగా గుంటూరు లో పెళ్లి జరగనుంది.ఈ పెళ్లి కోసం పలు సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసి ,ప్రస్తుతం యాదాద్రి అభివృద్ధి పనుల్లో కీలక బాధ్యతలు చూస్తున్న ఆనంద్ సాయి ఈ వివాహం కోసం సెట్టింగ్స్ వేస్తున్నారు.

cine setting for mlas son marriage

cine setting for mlas son marriage