ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం..

0
240

CM Chandrababu Expand AP Cabient Minister Posts
ఎందరినో ..ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం ఖరారైనట్టే..దసరా పండగ టైం లో క్యాబినెట్ లోమార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయినట్టు విశ్వసనీయ సమాచారం.ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోంది.మంత్రులు,మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల పనితీరుపై ఓ స్వతంత్ర సంస్థ తో సర్వే జరిపినట్టు సమాచారం.ఈ వ్యవహారం మీద లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.క్యాబినెట్ లోకి లోకేష్ ని తీసుకునే అంశం గురించి సర్వే లో అధిక ప్రాధాన్యం ఇచ్చారట .

మరోవైపు క్యాబినెట్ నుంచి తప్పించే జాబితాలో సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి ఓ మంత్రి ఉన్నట్టు భోగట్టా..ఈయన పనితీరు,అవినీతి గురించి సీఎం ఇప్పటికే ఖచ్చితమైన సమాచారం తెప్పించుకున్నారట.సీఎం రైట్ హ్యాండ్ గా భావిస్తున్న మరో మంత్రికి కూడా ఉద్వాసన లేదా శాఖమార్పిడి తప్పేట్టు లేదు .ఈసారి జాబితాలోవైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి స్థానం కల్పించే అవకాశం ఉందంట.ఆ ఇద్దరిలో ఒకరు రాయలసీమకి ,ఇంకొకరు కోస్తాకి చెందినవారట.