అమ్మ ఆరోగ్యంపై కరుణ ఆందోళన…

Posted September 30, 2016

jaya-karuna

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరి వారం రోజులైంది. ఆమె కేవలం జ్వరం, డీహైడ్రేషన్ తో ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు, అన్నాడీఎంకే వర్గాలు చెపుతున్నాయి. కానీ వారం రోజులైనా ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదని డీఎంకే అధినేత కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోప్యత పాటించడంవల్ల జనంలో లేనిపోని సందేహాలు వచ్చి శాంతి భద్రతల సమస్య కు దారితీయొచ్చని కరుణ అభిప్రాయపడ్డారు.

మరోవైపు అన్నాడీఎంకే వర్గాలు మాత్రం అమ్మ క్షేమంగా బయటికొస్తారని చెప్తున్నాయి. ఆమె ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మొద్దని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అలా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా జరిపినట్టు తెలుస్తోంది.