బీసీసీఐకి ఎదురుదెబ్బకు కమిటీనే కారణమా..?

0
74

Posted April 27, 2017 at 10:45

సమకాలీన క్రికెట్లో ఎదురులేని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా, బీసీసీఐకి ఐసీసీలో షాక్ తగిలింది. నమ్మకద్రోహి శశాంక మనోహర్ ద్రోహానికి, లాబీయింగ్ అనుభవం లేని అధికారుల కమిటీ తోడవడంతో… బీసీసీఐ దాదాపు పద్నాలుగు వందల కోట్లు నష్టపోనుంది. అధికారులతో బీసీసీఐని నడిపించాలనుకోవడం ఎంత తెలివితక్కువ పనో ఈ సంఘటన అందరికీ నిరూపించింది. తప్పకుండా బోర్డును నడిపించే అనుభవం ఉన్నవారికే బీసీసీఐని అప్పగించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఐసీసీలో తిరుగులేని విధంగా శాసిస్తూ వచ్చిన బీసీసీఐ.. అధికారుల నిర్వాకంతో ఏకంగా పరిపాలక ఓటుహక్కును కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో బీసీసీఐ ఏం చెబితే అది జరిగే స్థితి నుంచి.. అసలు మన బోర్డును ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది. పది సభ్య దేశాల్లో సహజంగా బీసీసీఐ ఏమంటే దానికి కనీసం నాలుగు సభ్య దేశాలు తలఊపేవి. కానీ ఈసారి శ్రీలంక మాత్రమే మనకు అనుకూలంగా ఓటేయడం.. తగ్గిన బీసీసీఐ పరపతికి ప్రత్యక్ష నిదర్శనం.

కనీసం సుప్రీంకోర్టు ఇప్పుడైనా జోక్యం చేసుకుని మాజీ క్రికెటర్లకు బోర్డును అప్పగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏం చేయాలనేదానిపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ టీమ్ ప్రకటించకపోయినా ఐసీసీ లొంగలేదంటే.. బీసీసీఐని అదే దారికొస్తుందనే నమ్మకం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యానికి తెరపడినట్లేనని భావిస్తున్నారు.