టీడీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత?

Posted February 1, 2017

congress leader mohammad jani mlc join tdp
ఎంతగా ఎదురుచూసినా ఇక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బతికి బట్టగలదన్న నమ్మకం కలగకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు తమకంటూ ఓ రాజకీయం ఆశ్రయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ జానీ ఒకరు.ఆది నుంచి కాంగ్రెస్ ని కనిపెట్టుకుని వున్న ఈ నాయకుడు ఇప్పుడు అధికార తెలుగుదేశం వైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా ఆయనకి ఆహ్వానం ఉన్నప్పటికీ జానీ తన అనుచరులతో చర్చించాక స్థానిక రాజకీయాల దృష్ట్యా టీడీపీ లో చేరేందుకు మొగ్గు జూపినట్టు సమాచారం.

టీడీపీ ఏపీ విభాగం అధ్యక్షుడు కళా వెంకటరావు తో జానీ ఇప్పటికే సమావేశమయ్యారు. టీడీపీ లో చేరేందుకు ఆయన ముందు జానీ సుముఖత వ్యక్తం చేసి పదవులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారట.కళా కూడా సానుకూలంగా మాట్లాడి లోకేష్, బాబు అనుమతి తీసుకున్నాక ముహూర్తం ఖరారు చేసుకుందామని చెప్పారట.