కేసీఆర్ బాహుబలి కాదు.. బఫూన్

0
44

 Posted April 29, 2017 at 10:05

congress leaders says kcr not a bahubali he is a buffoonవరంగల్ సభతో మాంచి ఊపు మీదున్నామని భావించిన తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. తెలంగాణ బాహుబలి కేసీఆరేనని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ బాహుబలి కాదని.. బఫూన్ అని ఎద్దేవా చేస్తున్నారు. ఏ వరంగల్ తో తమ జైత్రయాత్ర మొదలైందని టీఆర్ఎస్ నేతలు భ్రమిస్తున్నారో.. అదే చోటు నుంచి కేసీఆర్ పతనం మొదలైందని జోస్యం చెప్పారు. 2019లో కచ్చితంగా తామే గెలుస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. సర్వే ఫలితాలతో వణుకు పుట్టే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలు సన్నాసులంటున్న కేసీఆర్.. అదే కాంగ్రెస్ నేతల్ని తన పార్టీలో చేర్చుకున్న పెద్ద దద్దమ్మ అని మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. అలాంటిది తమను విమర్శించే హక్కు గులాబీ బాస్ కు లేదన్నారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చని కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని 2019లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అయితే ఉన్నట్లుండి కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మకంగా చేస్తున్నారా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ కు కూడా ఈ మధ్య కాలంలో పరోక్షంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ ఓయూలో కేసీఆర్ మాట్లాడలేకపోవడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. ఈ సందర్భాన్ని సర్దిచెప్పడం టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. కేసీఆర్ ప్రసంగిస్తే విద్యార్థులు తప్పకుండా అడ్డుకుంటారని స్వయంగా స్టేట్ ఇంటెలిజెన్స్ చెప్పిందంటే.. ఇక కేసీఆర్ కు రాష్ట్రంలో ఎంత పలుకుబడి ఉందో తెలుస్తందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే దిలాసాగా విమర్శలకు పదును పెడుతున్నారు.