జగన్ తో ఆ కాంట్రాక్టర్ రాయబేరం?

Posted September 28, 2016

 contractor offer jagan big deal
ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ తో జగన్ చేస్తున్న ఉద్యమం చల్లబరిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయా? ఔననే తెలుస్తోంది. అయితే ఈ పనికి పూనుకుంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. ఓ బడా కాంట్రాక్టర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒకప్పుడు వై.ఎస్, కేవీపీ తో అంటకాగిన ఆ కాంట్రాక్టర్ సర్కార్ మారగానే వెంటనే అధికార పక్షానికి చేరువయ్యాడు. ఇప్పుడు చాలా ప్రోజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇక ప్యాకేజ్ ఫలితాలు మొదలైతే బిజినెస్ పీక్స్ కి వెళుతుందని ఆశ పడుతున్నాడు ఆ పెద్ద మనిషి.

ఇంతలో జగన్ హోదా పోరాటం స్టార్ట్ చేయడం నచ్చని ఆ కాంట్రాక్టర్ పాత స్నేహాన్ని పురస్కరించుకొని జగన్ దగ్గరికి వెళ్లి ఓ ప్రపోజల్ పెట్టాడంట. అదేంటంటే…హోదా పోరాటం ఆపితే జగన్ చెప్పిన వారికి కొన్ని పనులు దక్కేలా చూస్తామన్నారట. ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇలాంటి ఆఫర్ రావడం ఆశ్చర్యమే. జనం పెద్దగా స్పందించకుండా రెండున్నరేళ్ల పాటు హోదా ఉద్యమం కొనసాగించడం కష్టమనుకుంటున్న జగన్.. వచ్చిన ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేక పోరాడుతారో చూడాలి.