కేసీఆర్ పై నోరు జారిన నారాయణ

0
88

Posted April 24, 2017 at 14:35

cpi Leader narayana tongue slip on kcrసీపీఐ నేత నారాయణ నోటికి హద్దూ పద్దూ లేకుండా పోతోంది. అందరి కంటే భిన్నంగా మాట్లాడుతూ మీడియాను అట్రాక్ట్ చేసే ఆయన.. చాలాసార్లు నోరుజారి తర్వాత సార చెబుతుంటారు. ఈసారి కూడా అలాగే గరం గరం వ్యాఖ్యలు చేశారు. విమర్శల పేరుతో హద్దు మీరారు. కేసీఆర్ చనిపోతే ఒక్కరు కూడా చూడటానికి రారని, అసలు సంతాప సభ పెట్టేవారే ఉండరనడం వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రిని తిట్టొచ్చు, ఆయన విధానాల్ని విమర్శించొచ్చు.. కానీ ఇలా వ్యక్తిగత విషయాలపై మాట్లాడమేంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ధర్నా చౌక్ తరలింపు ఆలోచనను నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ ఇప్పటికైనా అహంకారం తగ్గించుకుని, ప్రజాసంఘాల వాదన ఆలకించాలని కోరారు. అరవై ఏళ్లుగా ధర్నాచౌక్ ఉందని, అప్పట్నుంచీ లేని ఇబ్బంది.. కేసీఆర్ సీఎం అవ్వగానే ఎక్కడ్నుంచి ఊడిపడిందని ప్రశ్నించారు నారాయణ. ఎవరూ నిరసనలు తెలపొద్దని, అసలు తనను ప్రశ్నించొద్దన్నట్లుగా కేసీఆర్ వ్యవహారశైలి ఉండటం ఆందోళనకరం. పనిలో పనిగా కేసీఆర్ మనవడిపైనా నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అధికారిక కార్యక్రమాల్లో కేసీఆర్ మనవడు ఏ హోదాలో పాల్గొంటున్నాడని నిలదీశారు. చూస్తుంటే పదేళ్ల తర్వాత కేటీఆర్ కాకుండా కేసీఆర్ మనవడు సీఎం అయ్యేలా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు నారాయణ. లేకపోతే ఉద్యమ నేతగా వేగంగా ఎదిగిన కేసీఆర్.. అంతే వేగంగా కిందకు దిగిపోతారని హెచ్చరించారు. తెలంగాణ సమాజం క్రియాశీలకమైందని, ఎప్పుడు ఎవర్ని అందలం ఎక్కిస్తుందో.. ఎప్పుడు ఎవర్ని తొక్కేస్తుందో ఎవరికీ తెలియదని చురకలంటించారు నారాయణ.