ఒంటరైపోయిన జగన్!!

Posted December 2, 2016

Image result for cpi party not supported to jagan
వైసీపీ అధినేత జగన్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారిపోతున్నా ఏం చేయలేక నిస్సహాయుడుగా మిగిలిపోయిన ఆయనకు ఇప్పుడు మరో పెద్ద షాక్ తగిలింది. తనకు చేదోడు వాదోడుగా నిలుస్తారనుకున్న కామ్రేడ్లు .. ఆయనకు మొండిచెయ్యి ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎర్రసైన్యం ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపడమే ఇందుకు కారణం.

Image result for ap cpi secretary ramakrishna and pawan kalyan

ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రావు .. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. చాలాసేపటిదాకా వీరి మధ్య చర్చలు జరిగాయి. చర్చల తర్వాత రామకృష్ణ ఆనందాన్ని బట్టి చూస్తే… కామ్రేడ్లతో ఫ్రెండ్ షిప్ ఖాయమేనని అందరికీ అర్థమైపోయింది. పవన్ కు లెఫ్ట్ భావజాలం ఉండడం …. ఇప్పుడు కామ్రేడ్లతో ఆయనకు అవసరం ఉండడంతో ఇద్దరి పొత్తు ఖరారైపోయిందని ప్రచారం జరుగుతోంది.

కామ్రేడ్లు, పవన్ మధ్య దోస్తానా కనిపిస్తుండడంతో జగన్ వర్గం ఆందోళన చెందుతోందట. ఇప్పటివరకు ప్రత్యేక హోదా, ఇతర అంశాల విషయంలో… ప్రభుత్వంపై చేసిన పోరు కామ్రేడ్లు… జగన్ పార్టీతో కలిసి నడిచారు. చాలా సమస్యలపై ఉద్యమాలు నడిపారు. కానీ ఇప్పుడు వారు పవన్ ను చూసుకోవడంతో జగన్ ఢీలా పడ్డారని సమాచారం. ఎర్రసైన్యం అంత ఈజీగా పవన్ తో కలిసిపోతుందని ఆయన ఎక్స్ పెక్ట్ కూడా చేయలేదట.

ఎర్రసైన్యం కూడా చేయిచ్చే సూచనలు కనిపించడంతో జగన్ పార్టీ ఇక ముందు ఎవరితో కలిసి పోరాడుతుందో క్లారిటీ లేదు. ఆపార్టీ కాంగ్రెస్ తో కలవలేదు. బీజేపీతో ఛాన్స్ లేదు. కామ్రేడ్లు చేయిచ్చారు. పోరాడాల్సింది టీడీపీతో. పార్టీలు ఎవరికి వారుగా ఉండడంతో జగన్ పార్టీ ఇక ఒంటరిగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.