ఆ ఎర్ర ఛానల్ కి కొత్త రక్తం ఎక్కిస్తున్నారు..లేచి నుంచుంటుందా?

Posted April 21, 2017 at 12:47

CPI put new staff and new programs in 99 tv channel
2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడంలో సాక్షి పాత్ర ఎంతో ఉందా ? అందులో నిజముందో లేదో గానీ ఆ విషయం అన్ని రాజకీయ పార్టీలు బాగా ఒంటబట్టించుకున్నాయి.అందుకే పార్టీలు,నేతలు చేతిలో ఓ ఛానల్ ఉంటే అధికారం గుప్పిట్లోకి వస్తుందని భావించి ఆ దిశగా అడుగులేశారు.ఆ టైం లోనే వామపక్షాలు సైతం అదే బాటలో నడిచాయి.సిపిఎం తరపున 10 టీవీ, సిపిఐ తరపున 99 టీవీ రంగంలోకి వచ్చాయి.అయితే వాళ్ళు అనుకున్నట్టు ఛానెల్స్ వల్ల పార్టీకి మేలు మాట అటుంచి ఆర్ధిక భారం పడింది.ఈ రెండు ఛానెల్స్ లో 10 టీవీ పరిస్థితి కొంత మెరుగు.అక్కడా అంతర్గత రాజాకీయాలు వున్నా కొంతలో కొంత నయం.కానీ 99 టీవీ పరిస్థితి దారుణం.ఆ ఛానల్ అన్ని విధాలుగా దెబ్బ తింది. అయినా పోరాటానికి మారు పేరైన ఎర్ర సేన ఇంకో ప్రయత్నం చేస్తోంది.

గాడి తప్పిన 99 టీవీ ని మళ్లీ ట్రాక్ ఎక్కించడానికి యాజయాన్యం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కొత్త సిబ్బంది,సరికొత్త ప్రోగ్రామ్స్ ,మౌలిక అవసరాలు,ఇతరత్రా సాంకేతిక,కేబుల్ అవసరాలకు తగినట్లు ఆర్ధిక వెసులుబాటుతో మళ్లీ సీన్ లోకి వస్తోంది.ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి బాగా లేకపోయినా, పోయిన చోటే వెదుక్కోవాలన్న సూత్రంతో జవసత్వాలు కూడగట్టుకుని వస్తున్న 99 టీవీ ప్రయాణం ఎలా కొనసాగుతుందో చూడాలి.