డిసెంబర్ మొత్తం బాలయ్యదే హవా..!

Posted November 24, 2016

Crazy Promotional Planning For Balaiah Sathakarni Movieసంక్రాంతి వార్ కు సంసిద్ధమవుతున్న బాలయ్య బాబు ప్రస్తుతం తను నటిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న శాతకర్ణి యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద దృష్టి పెట్టింది. అయితే ఈ క్రమంలో డిసెంబర్ నెలలో మొత్తం శాతకర్ణి సినిమా సందడే ఉండబోతుందని తెలుస్తుంది. డిసెంబర్ 9న శాతకర్ణి టీజర్ రిలీజ్ చేస్తుండగా.. 16న ఆడియో భారీ ఎత్తున విడుదల చేసేలా చూస్తున్నారు.

ఇక ఈ రెండు కార్యక్రమాలను ముగించుకున్నాక ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా జరుగనున్నారట. క్రిష్ డైరక్షన్లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రతో తెరకెక్కించబడుతుందని తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన బాలయ్య బాబు ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవడం ఖాయమని తెలుస్తుంది.

డిసెంబర్ మొత్తం సినిమా ప్రమోషన్స్ తో హోరెత్తించి జనవరి 12న మూవీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీయా హీరోయిన్ గా నటిస్తుండగా చిరంతన్ బట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.