దాసరితో కన్నీళ్లు పెట్టించిన మంచు లక్ష్మీ

0
72

Posted October 8, 2016

    dasari narayana  rao crying watching lakshmi manchu acting

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్’. శుక్రవారం హైదరాబాద్ లో ఈ చిత్రం ఆడియో వేడుక ఘనంగా జరిగింది. చిత్రం ఈ ఆడియో వేడుకలో దాసరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. “‘హైదారాబాద్ లో లక్ష్మి ఒక నాటకంలో నటిస్తుంటే మోహన్ బాబు,
నేను చూసేందుకు వెళ్లాము. లక్ష్మి నటన చూసి నాకు కళ్ల వెంబడి నీళ్లొచ్చేశాయి. మా ముందు చిన్నపిల్లగా తిరిగిన లక్ష్మి, స్టేజ్ పై ఎంతో గొప్పగా నటిస్తుంటే చాలా ఆనందపడ్డాను” అని అన్నారు దాసరి.

ఇక, నా మనసుకు అనిపించింది ఎప్పుడూ జరుగుతుందని.. ‘ప్రేమమ్’ చిత్రం ట్రైలర్ చూసి, ఆడియో విన్నాక ఆ చిత్రం కచ్చితంగా హిట్టవుతుందని
అనిపించింది.  ఇప్పుడు లక్ష్మీ బాంబు’ ఆడియో ఫంక్షన్ లో కూడా అలాగే అనిపిస్తోందని.. లక్ష్మీబాంబు లక్ష్మీ హిట్ కొడతుందన్నారు. ఈ ఆడియో
వేడుకలో దాసరితో పాటు మోహన్ బాబు, చిత్ర బృందం, తదితరాలు పాల్గొన్నారు.

వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ సంయుక్త నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.