ఇండస్ట్రీలో దాసరి ప్రకంపనలు ?

Posted November 20, 2016

dasari rumours in industry
దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పినదంతా చేస్తాడో లేదో కానీ ఇంకో బాంబు పేల్చాడు.ఓ నిర్మాతగా,దర్శకుడిగా ఇండస్ట్రీ లో తనకు ఎదురైన అనుభవాలు అన్నిటినీ ఓ పుస్తకం గా రాయడానికి అయన నిర్ణయించుకున్నారు.స్వర్గీయ టి.కృష్ణ మీద రాసిన పుస్తకావిష్కరణ సభలో దాసరి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో పాటు …పుస్తకంలో ఉన్నదున్నట్టు రాస్తానని చెప్పుకొచ్చారు.ఏడాదిలోపే ఆత్మకథ విడుదల అంటూ దాసరి డెడ్ లైన్ కూడా పెట్టేసారు.దీంతో చిత్రసీమలో దాసరితో పనిచేసిన వాళ్ళు ,చేయని వాళ్ళు,పరిచయం వున్నవాళ్ళు,లేని వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు.అందుక్కారణం లేకపోలేదు …

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తో పని చేసి కూడా రాజకీయంగా ఆయనతో విభేదించారు దాసరి. ఇక మెగా కుటుంబంతో దాసరి గొడవల గురించి అందరికీ తెలిసిందే. అక్కినేనితో అయితే దాసరికి మాటలే లేకుండా పోయాయి.తన అభిమాన నటుడితోనే దాసరికి పడలేదంటే అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ దాసరి ఏమి ప్రకంపనలు రేపుతాడో అని బెదురుబెదురుగా ఎదురు చూస్తున్నాయి.మరికొందరు మాత్రం దాసరి సందర్భాన్ని బట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతారు గానీ అయన ఆత్మకథ రాసినప్పుడు చూడొచ్చులే అనుకుంటున్నారు .