దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు ఉరి..

Posted December 19, 2016

dilsukhnagar

దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించింది.దాదాపు మూడున్నరేళ్లపాటు సాగిన విచారణ అనంతరం 157 మంది సాక్షుల వాంగ్మూలం, 501 పత్రాలు, 173 వస్తు సాక్ష్యాలను ఎన్ఐఏ న్యాయస్థానానికి సమర్పించింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా దోషులకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ కోర్టును కోరింది. ఈ కేసులో ఏ-1 రియాజ్‌ భత్కల్‌, ఏ-2 అసదుల్లా అక్తర్‌, ఏ-3 తెహరీన్‌ అక్తర్‌, ఏ-4 వకాస్‌, ఏ-5 యాసిన్‌ భత్కల్‌, ఏ-6గా ఇజాజ్‌ షేక్‌ పేర్లు ఉన్నాయి. అయితే ఏ-1గా ఉన్న రియాజ్ భత్కల్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంటున్నట్లు సమాచారం. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 22 మంది మృతి చెందగా, 138 మందికిపైగా గాయపడ్డారు. ఈ కోర్టు తీర్పుపట్ల బాధితులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.