భిక్షగత్తెగా మారిన అందాల హీరోయిన్..

0
103

Posted November 11, 2016

deepika padukone beggar role in new movie
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే గ్లామర్ రోల్స్ కి పెట్టింది పేరు.అలాంటి అమ్మాయి ఒక్కసారిగా భిక్షగత్తె అవతారంలో దర్శనమిస్తే ఎలా ఉంటుంది…షాక్ తగులుతుంది.నిజంగా ఆ పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇస్తోంది దీపికా.అసలెందుకు దీపికా అడుక్కునే అమ్మాయి పాత్రలో కనిపిస్తోందంటే …. అందుక్కారణం ఓ సినిమానే.ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిదీ డైరెక్షన్ లో ఓ సినిమా అంగీకరించింది ఈ అమ్మడు.అందులో భాగమే ఈ పాత్ర అని తెలుస్తోంది.సినిమా మొత్తం ఆమె ఇదే వేషంలో కనిపిస్తుందా లేక కొద్దిసేపా అనేది తెలియాల్సివుంది.