నేత్ర దాత దేవి శ్రీ ప్రసాద్..

   devi sri prasad help blind people donation moneyతెలుగు పరిశ్రమ సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఆయన అభిమానుల లిస్టులో సూపర్‌స్టార్సే ఉంటారు. మంచి క్రేజ్ సంపాదించుకున్న డీఎస్పీని అంతా ‘రాక్ స్టార్’ గా పిలుచుకుంటారు. ఈ సంగీత తరంగం ఈ మధ్య యూఎస్ టూర్ వెళ్లి టెలివిజన్ ప్రోగ్రామ్స్ చేసి కొంత డబ్బుని సంపాదించాడు. భారత్‌కు వచ్చాక దేవి శ్రీ ఆ డబ్బునంతా కంటి చూపు సరిగాలేని పిల్లల వైద్యం నిమిత్తం విరాళంగా ఇచ్చేశాడు. ఈ సంగతి తెలిసిన అందరూ ఆయన మంచితనంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సినీ ప్రముఖుల్లో సమాజం పట్ల పెరిగిన భాద్యతను మెచ్చుకుంటున్నారు. అభాగ్యులను ఆదుకునేందుకు ఆయనలాగే మరికొందరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు.