దెయ్యం కూడా పవర్ స్టార్ ఫ్యాన్ అబ్బా..!

Posted November 18, 2016

Devil Also Fan Of Pawan Kalyanఛాన్స్ దొరికితే స్టార్ హీరోని తమ సినిమాలో వాడుకుని ప్రేక్షకుల్లోకి వెళ్లాలని చూస్తారు కుర్ర హీరోలు. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో కూడా పవన్ జపం చేశారు. ఇందులో హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అయితే ఆమె చనిపోయి వేరే దేహంలో ప్రవేశించినా ఆ ఫేవరిజం అలానే ఉంటుంది. పవర్ స్టార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ రాగానే లేచి డ్యాన్స్ చేస్తుంది. అంతేకాదు పవన్ మేనరిజం అయిన మెడ మీద చెయ్యి కూడా వేసి డైలాగ్ చెబుతుంది. ఇక అప్పుడే హీరో ఫ్రెండ్ క్యారక్టర్ వేసిన సత్య దెయ్యాలు కూడా పవన్ ఫ్యాన్సేనా అనేస్తాడు.

సో అలా పవన్ ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకుని సినిమా మరింత పబ్లిసిటీ వచ్చేలా చేసుకున్నాడు. సినిమా మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ వస్తుంది. నోట్ల రద్దు ఉన్నా సరే సినిమా కలక్షన్స్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ పడే అవకాశం లేదనిపిస్తుంది. సినిమాకు రెస్పాన్స్ కూడా బాగానే ఉంది కాబట్టి నిఖిల్ కెరియర్ లో మరో సూపర్ హిట్ సినిమా పడ్డట్టే.

ఇక ఈ సినిమాలో కేవలం పవన్ కళ్యాణ్ నే కాదు దర్శక ధీరుడు రాజమౌళిని వాడేశారు. హీరో బాహుబలి-2కి గ్రాఫిక్స్ వర్క్ పనిచేస్తున్న టీంలో ఉంటాడు. ఇంట్లో దెయ్యానికి మాత్రం తనకు రాజమౌళితో మీటింగ్ ఉందని చెప్పగా టివి ఆన్ చేస్తే వేరే ఛానెల్ లో రాజమౌళి లైవ్ ఇంటర్వ్యూ వస్తుంది. సో అలా పవన్, రాజమౌళిలను ఎలా వాడాలో ఆ రేంజ్లో వాడేస్తాడు దర్శకుడు ఆనంద్. ఏం చేసినా ఎలా చేసినా సినిమా హిట్ టాక్ వచ్చింది ఇక తిరుగేముంది చెప్పండి.