రేపే దేశంలోకి నెహ్రూ

0
78

  devineni nehru join tdp tomorrow

టీడీపీలో దేవినేని నెహ్రూ చేరికకు ముహూర్తం ఖరారయింది. రేపు సా. 4గంటలకు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు అవినాష్‌, కడియాల బుచ్చిబాబు టీడీపీ గూటికి రానున్నారు. రేపు మ. 3 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంజిసర్కిల్‌, రామవరప్పాడు రింగ్‌ మీదుగా సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించి, సా. 4కి గుణదల బిషప్‌ గ్రాసీ హైస్కూల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నెహ్రూకు చంద్రబాబు పార్టీ కండువా కప్పుతారు. ఎప్పటి నుంచో టీడీపీలోకి వస్తున్నట్లు చెబుతున్నప్పటికీ రేపు అధికారికంగా ఆ పార్టీలో చేరుతున్నారు.