10 వేల కోట్ల జగన్ బ్లాక్ మనీ వైట్ అయ్యిందా?

Posted October 10, 2016

  devineni umamaheswara rao said jagan change black money white money
ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ఓ కేంద్ర పధకం వైసీపీ అధినేత జగన్ పాలిట వరమయ్యిందా? ఔననే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అదెలాగంటే…నల్ల ధనాన్ని వెలికితీయడానికి మోడీ సర్కార్ రూపొందించిన పధకాన్ని జగన్ ఉపయోగించుకున్నారని ఉమా ఆరోపణ. బినామీల పేరుతో వున్న నల్లధనాన్ని వైట్ లోకి జగన్ మార్చింది 10 వేలకోట్లు ఉంటుందని మంత్రి చెప్పారు.ఇదే గాక జగన్ పేరిట ఉన్న ఆస్తులంటూ అయన ఓ జాబితా విడుదల చేశారు.

ఉమా చెప్పిన దాని ప్రకారం జగన్ కి వివిధ జిల్లాల్లో బినామీల పేరుతో 94,038 ఎకరాల భూములు వున్నాయి..వాటి విలువ 33 ,935 కోట్లని మంత్రి అంచనా వేశారు.ఇక 1,81,000 ఎకరాల గనులు జగన్ ఆధీనంలో ఉన్నట్టు కూడా ఉమా ఆరోపించారు.ఉమా ఆరోపణలు నిజమైతే ప్రధాని మోడీ ప్లాన్ జగన్ కి బాగా వర్క్ అవుట్ అయినట్టే..