రోజాని అందుకే …డీజీపీ

Posted February 11, 2017

dgp sambasiva rao said about why you arrested to roja
రోజాని మహిళా పార్లమెంట్ సదస్సుకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తప్పుబడుతూ వైసీపీ రంగంలోకి దిగింది.ఆ పార్టీ నేతలు కొందరు విజయవాడలో డీజీపీ సాంబశివరావు ని కలిసి తమ అభ్యంతరాలు తెలియజేశారు.రోజాని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.దీనిపై డీజీపీ సాంబశివరావు స్పందించారు.తాము ఎవరికీ వ్యతిరేకం కాదని డీజీపీ స్పష్టం చేశారు.రోజా మహిళా పార్లమెంట్ సదస్సుకి విఘాతం కలిగిస్తారన్న సమాచారం ఉన్నందునే ఆమెని అడ్డుకున్నట్టు డీజీపీ చెప్పారు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రోజా చేసిన కామెంట్స్ ని కూడా డీజీపీ గుర్తు చేశారు. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చిన సదస్సుకి ఏ ఇబ్బంది కలక్కుండా చూసేందుకే ఆమెని అదుపులోకి తీసుకున్నామని సాంబశివరావు వివరించారు.గొడవ చేయబోమని హామీ ఇస్తే రోజాని విజయవాడ తీసుకొచ్చి వదిలిపెట్టేందుకు ఏ అభ్యంతరం లేదని సాంబశివరావు తెలిపారు.