ఉలిక్కిపడ్డ ధర్మాన..పత్రికల ఖాతాలో తప్పు ..

  dharmana prasada rao shocked from media
వైసీపీ కార్యకర్తల సమక్షంలో తాను చేసిన వ్యాఖ్యలు ఇంత సంచలనం సృష్టిస్తాయని ఊహించని ధర్మాన తాజా పరిణామాలతో వులిక్కిపడ్డారు.అందరు రాజకీయ నేతలు చెప్పినట్టే తప్పంతా పత్రికలదేననేశారు.వాటి యాజమాన్యాలు కుట్రతో తనను వై.ఎస్.కుటుంబానికి దూరం చేస్తున్నాయని ఆరోపించారు.ఇంతకీ సార్ ఏమన్నారో గుర్తుందిగా …వైసీపీ కడపలో గెలిచినంత తేలిగ్గా శ్రీకాకుళంలో గెలవలేదన్నారు.అందుకోసం పార్టీ అధ్యక్షుడు జగన్ పేరు కూడా వాడడం తో రభస అయింది.

అయితే ధర్మాన వివరణ ,ప్రత్యారోపణ ఆయన స్థాయికి తగ్గట్టు లేవు.ఒక జిల్లా స్థాయి సమావేశంలో ధర్మాన ఇలా మాట్లాడతారని పత్రికల యజమానులు ఊహిస్తారా? పైగా వై.ఎస్ కుటుంబానికి వేరే వాళ్ళు మిమ్ముల్ని దూరం చేయడమేంటి? మీ సోదరుడు వై.ఎస్ కుటుంబానికి అండగా వున్నాడు కానీ మీరు అవకాశాలన్నీ మూసుకుపోయాకే ఫ్యాన్ స్విచ్ వేసిన విషయం జనానికి ..ఫ్యాన్ రెక్కలు తిప్పే జగన్ కి బాగానే గుర్తున్నాయిలే..