జైట్లీకి చెప్పకుండా నోట్ల రద్దా?

Posted November 25, 2016

did the currency banned without the order from Arun jaitli
500, 1000 రూపాయ‌ల నోట్ల ర‌ద్దుపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్నారా? క‌నీసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా స‌మాచారం ఇవ్వ‌లేదా? అంటే ఔన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గురువారం రాజ్య‌స‌భ‌లో నోట్ల ర‌ద్దు అంశంపై స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీ న‌రేశ్ అగ‌ర్వాల్ మాట్లాడారు. క‌రెన్సీ క‌ష్టాల‌పై ప్ర‌సంగిస్తూ.. ప్ర‌ధాని మోడీ … అరుణ్ జైట్లీకి చెప్పకుండానే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తుంది అన్నారు. ఒక‌వేళ చెప్పి ఉంటే జైట్లీ కనీసం త‌న‌కు చెవిలోనైనా ఈ విష‌యాన్ని చేర‌వేసే వారని ఆయ‌న చెప్పుకొచ్చారు. న‌రేశ్ అగ‌ర్వాల్ ఇలా అన‌గానే ప్ర‌ధాని మోడీ, జైట్లీ విర‌గ‌బ‌డి నవ్వారు. ఈ న‌వ్వే ఇప్పుడు అనుమానాల‌కు తావిస్తోంది.

ప్ర‌ధాని మోడీ నిజంగానే ఆర్థిక‌మంత్రి జైట్లీకి స‌మాచారం .. ఇచ్చారా లేదా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే.. వారిద్దరి న‌వ్వు వెన‌క ఏదో ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మోడీ ..జైట్లీకి చెప్ప‌కుండానే నిర్ణ‌యం తీసుకున్నారు కాబ‌ట్టే.. ఈ హాస్యం చోటుచేసుకుంద‌ని ప్ర‌తిప‌క్షాలు బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాయి. ఏమో మ‌రి.. అలా జ‌ర‌గ‌డానికే ఎక్కువ అవ‌కాశ‌ముంద‌ని చాలా పార్టీలు అనుకుంటున్నాయి.