చిన్నమ్మకి లేనిది,పన్నీరుకి ఉన్నది ఇదే..

Posted February 10, 2017

difference between sasikala and panneerselvam
యుద్ధం మొదలైతే గానీ ఎవరి బలమెంతో,బలహీనత ఏంటో ప్రత్యర్థికి అర్ధంకాదు.చూస్తున్నవాళ్ళకి కూడా బోధపడదు.ఇప్పుడు తమిళనాట జోరుగా సాగుతున్న రాజకీయ యుద్ధం చూస్తుంటే ఈ విషయం అర్ధమవుతోంది.తన మాట తూచా తప్పకుండా పాటించిన పన్నీర్ సెల్వాన్ని చూసి శశికళ తక్కువ అంచనా వేసివుంటుంది.శత్రువుగా బరిలో తలపడదలిచినప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అయివుంటుంది.దానికి ఫలితమే ఇప్పుడు ఆమె అనుభవిస్తోంది.తన మాట విన్నవాడల్లా తన కంటే తక్కువ స్థాయి వాడని భావించి చిన్నమ్మ బొక్కబోర్లా పడింది.ఈ అవగాహన శశికళలో లేకపోయింది.

అదే సమయంలో ఈ యుద్ధంలో పన్నీర్ కి ఉన్నది ఏమిటో కూడా చూద్దాం..సహనం,ధైర్యం. నిజానికి పైకి ఈ రెండూ భిన్న ధృవాలుగా కనిపిస్తాయి.కానీ మొదటిది ఉన్నవాడికి రెండోది సాధ్యమవుతుంది.సహనం విషయంలో పన్నీర్ ని వేలెత్తి చూపే అవసరం లేదు.జయ మొదలుకుని నిన్నమొన్నటిదాకా శశికళనే కాదు ..ఆమె వందిమాగధుల్ని కూడా ఆయన భరించాడు.ఓ మంత్రి ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా పెట్రేగిపోయినా సహనంగా వున్నాడు.ఎక్కడా నోటికి పని చెప్పలేదు.ఇక యుద్ధం తప్పదనుకున్నప్పుడు నేరుగా రంగంలోకి దిగాడు.ఎదుట ఉన్నది నిన్నటిదాకా తనపై పెత్తనం చేసినవాళ్ళని కూడా చూడకుండా ఢీకొట్టాడు.రంగంలోకి దిగాక ఒక్కసారికూడా ఆయన శశికళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.పోయెస్ గార్డెన్ సహా వివిధ అంశాల్లో చెప్పిన మాటని గంటల్లో అమలు చేసేందుకు నడుం కట్టాడు.ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది శత్రువు ఎంత గొప్పవాడన్నది పక్కనబెట్టి తనదైన శైలిలో యుద్ధానికి వ్యూహరచన చేశాడు.శశి తరహాలో క్యాంపు లు గట్రా లేకుండా ఎమ్మెల్యేలే తన వైపు వచ్చేలా పరిస్థితి మార్చేశాడు.మొత్తానికి పన్నీర్ లో ఉన్నది..చిన్నమ్మలో లేనిది ఆ రెండూ మాత్రమే ..సహనం,ధైర్యం.