జబర్దస్త్‌ రచయితకు దిల్‌రాజు ఛాన్స్‌

Posted April 21, 2017 at 11:34

dil raju give director chance to jabardasth show writer prasanna kumar
ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ఎంతో మంది తెలుగు సినిమా పరిశ్రమకు కమెడియన్స్‌గా పరిచయం అవుతున్న విషయం తెల్సిందే. అయితే జబర్దస్త్‌ నుండి టెక్నీషియన్స్‌ పరిచయం కాలేదు. మొదటి సారి జబర్దస్త్‌ టెక్నీషియన్‌ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. జబర్దస్త్‌ ఆరంభంలో స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేసిన ప్రసన్న కుమార్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద అవుతున్నాడు. ఇటీవల త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్‌’ చిత్రానికి ప్రసన్న కుమార్‌ సహ రచయితగా వ్యవహరించాడు.

ఆ సమయంలోనే ప్రసన్న కుమార్‌ పనితనం నచ్చిన దిల్‌రాజు ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఒక మంచి లవ్‌ స్టోరీని దిల్‌రాజుకు ప్రసన్న వినిపించడం, దిల్‌రాజు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగి పోయిందట. త్వరలోనే వీరి కాంబోలో ఒక యువ హీరోతో సినిమా ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగబోతుంది. జబర్దస్త్‌ ఆరంభంలో మంచి స్కిట్‌లతో, పంచ్‌ డైలాగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రసన్న సినిమా దర్శకుడిగా ఆకట్టుకుంటాడేమో చూడాలి. దిల్‌రాజు ఎవరిని అంత సులభంగా నమ్మడు, ఆయన నమ్మి అవకాశం ఇచ్చాడు అంటే ప్రతిభ ఉన్న వ్యక్తి అయ్యి ఉంటాడు అని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రసన్న భవిష్యత్తులో మంచి దర్శకుడు అవుతాడేమో చూడాలి.