స్పీడ్ పెంచేసిన దిల్ రాజు…

Posted February 14, 2017

dil raju plan 5 movies in this yearదిల్ రాజు… తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాత. ఇంతకముందు ఏడాదికి ఒకటి రెండు సినిమాలను చేసే ఈ నిర్మాత ఈ ఏడాది  ఏకంగా ఐదు  సినిమలను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధమ్ చేస్తున్న రాజు  మరో ఇద్దరు యంగ్ హీరోలతో సినిమాలను నిర్మించేందుకు ఓకే చెప్పాడు. వీటిలో ఒక సినిమాలో నాని హీరోగా నటిస్తుండగా, మరో దాన్లో  రాజ్ తరుణ్ హీరోగా నటించనున్నాడు.

రీసెంట్ గా  నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన నేను లోకల్ మంచి విజయాన్ని అందుకుంది.  అందుకే మళ్లీ ఇంకో సినిమా కూడా నానితోనే ప్లాన్ చేస్తున్నాడట.  ఓ మై ఫ్రెండ్ మూవీకి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్.. ఈ నాని సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఇక రాజ్ తరుణ్ సినిమాకి.. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాల స్క్రిప్ట్ లు మార్చి నెలాఖరుకల్లా రెడీ కానున్నాయి. ఏప్రిల్ నుండి రెండు సినిమాలను పార్ లెల్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. శతమానం భవతి, నేను లోకల్ తో మంచి  విజయాలను అందుకున్న దిల్ రాజు ఈ వరుస సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకోనున్నాడో చూడాలి.