చైతు కొత్త సినిమా ఆ రెండు పాత చిత్రాల కలయికా?

 Posted November 1, 2016

dil raju said about naga chaitanya sahasam swasaga sagipo movie
అక్కినేని వారసుడు నాగ చైతన్యని వెండితెరకి పరిచయం చేసిన దిల్ రాజు ఓ సినిమా విషయంలో ఎగ్జైట్ అయిపోతున్నాడు.అదే ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా నైజాం హక్కులు తీసుకున్న రాజు కొత్త సినిమాని రెండు పాత సినిమాలతో పోల్చాడు.అందులో ఒకటి ఏ మాయ చేసావే అయితే …ఇంకోటి వెంకటేష్ నటించిన ఘర్షణ .ఈ రెండు సినిమాలకి దర్శకుడు గౌతమ్ మీనన్ .ఒకటి ప్రేమకి …మరోటి యాక్షన్ కి బెంచ్ మార్క్ లా నిలిచిన చిత్రాలివి.ఇప్పుడొస్తున్న సాహసం శ్వాసగా సాగిపో ఫస్ట్ హాఫ్ ఏ మాయ చేసావే లా ,సెకండ్ హాఫ్ ఘర్షణ లా ఉందని దిల్ రాజు పోల్చాడు.ఓ కుర్రోడు మగాడిగా మారే ప్రక్రియని అద్భుతంగా తీసాడని దర్శకుడిపై ప్రశంసలు కురిపించాడు.ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తీసిన సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. ప్రేమమ్ హిట్ తో చైతు క్రేజ్ పెరిగిన ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది..దిల్ రాజు మాటలు నిజంగా మనసులోనుంచి వచ్చాయా?లేక మార్కెటింగ్ వ్యూహమా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

[wpdevart_youtube]9kd3lOprII8[/wpdevart_youtube]