రవితేజ తర్వాత “నాని”నేనట

Posted February 8, 2017

dil raju says ravi teja and nani only talent to be gain successగాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరో స్థానాన్ని దక్కించుకున్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. ఆయన తర్వాత ఆ విధంగా సినీ సపోర్ట్ ఏమీ లేకుండా వచ్చిన మరో హీరో రవితేజ. సినిమా రిలీజైతే చాలు.. హిట్ ఫ్లాప్ లతో సంబంధంలేకుండా ఈ మాస్ మహారాజా 20కోట్లను కలెక్ట్ చేస్తాడు. అది హిట్ అయ్యిందంటే చాలు 30 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తాడు. ఒకానొక టైంలో చిరు నటించిన ఇంద్ర సినిమాతో పోటీ పడి రవితేజ కలెక్షన్లను సాధించాడంటే రవితేజకి ఉన్న స్టామినా ఏంటో  అర్ధమవుతోంది. తాజాగా నాని ఆ రేంజ్ ని అందుకున్నాడు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు… టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత సొంత కాళ్లపై నిలదొక్కుకుని.. స్టార్ హీరో అయింది రవితేజ మాత్రమే అన్న దిల్ రాజు…  రవితేజ తర్వాత ఇప్పుడు అలా ఎదుగుతున్న హీరో నాని అని కితాబిచ్చాడు.  అయితే ‘నేను లోకల్’ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్, సక్సెస్ రేంజ్ చూస్తుంటే.. నాని రవితేజలా ఎదుగుతుండటం కాదు.. రవితేజ స్థాయిని అందుకున్నాడంటున్నాయి సినీ వర్గాలు.

నాని నటించిన మజ్ను, జెంటిల్ మన్, నేను లోకల్ సినిమాలు అంత గొప్పసినిమా లేవీ కాదని, అయితే కేవలం నాని తన ఫర్ఫామెన్స్ తో సినిమాకు ఆ రేంజ్ హిట్ ని తీసుకొస్తున్నాడని అంటున్నారు. ఇంతకుముందు యావరేజ్ సినిమాల్ని కూడా తన మాస్ యాక్టింగ్ తో రవితేజ హిట్ వైపుకు నడిపించినట్లు, ఇప్పుడు నాని కూడా తన క్రేజీ నటనతో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమా రేంజ్ ని పెంచుతున్నాడంటున్నారు. తన యాక్టింగ్ తో మినిమం 15 కోట్లు రాబట్టగలిగే నాని  ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 20 కోట్ల కలెక్షన్లను సాధిస్తాడన్న గ్యారెంటీ ఉండడంతో  నిర్మాతలు కూడా నానితో సినిమాలను రూపొందించేందుకు ముందుకొస్తున్నారట.