దిల్ రాజు స్కెచ్ వర్కౌట్ అయ్యింది!!

Posted February 4, 2017

dil raju sketch workout in nenu local movie cast and crewసినిమా అంటే కేవలం అంచనా. ఓ స్కెచ్ ప్రకారం సినిమాలను రూపొందించి వాటిని హిట్ చేసేస్తుంటారు నిర్మాతలు. ఆ విధంగా ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాఫ్ అవుతుందో అంచనా వేయగల సమర్ధుడు  దిల్ రాజు. దాదాపు ఆయన సినిమాలన్నీ  హిట్ టాక్ ను సొంతం చేసుకున్నవే. ఫలానా కధకి ఫలానా హీరో అయితే సినిమా హిట్ అవుతుంది  అని ఆయన చేసే ఎక్స్ పెక్టేషన్ కరెక్ట్  గా వర్కౌట్ అవుతుంది.

తాజాగా ఆయన వేసిన మరో స్కెచ్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. అదేనండి…. ఆయన నిర్మాణ సారధ్యంలో నిన్న రీలీజైన నాని సినిమా నేను లోకల్… మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. యూఎస్‌ ప్రీమియర్‌ షోల ద్వారా కూడా ఈ సినిమా భారీగానే ఆర్జించింది. ‘శతమానం భవతి’ ఘనవిజయంతో మంచి జోష్‌లో ఉన్న దిల్‌ రాజుకు నేను లోకల్ తో మరో విజయం లభించింది.  అయితే ఈ సినిమా దర్శకుడు నక్కిన త్రినాధ్‌ ఈ కథను రెడీ చేసింది నానిని దృష్టిలో ఉంచుకుని కాదట. కథ రాసేటప్పుడు అసలు సీన్లో నాని లేనేలేడని, రాజ్ తరుణ్ కోసం ఈ సినిమా కధను రెడీ చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

దర్శకుడు కధ చెప్పగానే  నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ కూడా రాజ్‌తరుణ్‌ తోనే సినిమా చేద్దామనుకున్నాడట. అయితే  ఫైనాన్స్‌ కోసం దిల్‌ రాజు వద్దకు వెళ్లి కథ వినిపించగా… ఈ కథ నానికి అయితే బాగుంటుందని, రాజ్ తరుణ్ కన్నా నాని అయితేనే సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పాడట. మంచి రైజింగ్ లో ఉన్న నాని వల్ల బిజినెస్ కూడా బాగుంటుందని చెప్పి, అందుకు అంగీకరిస్తే  తాను ఆ టీమ్ లో చేరతానని చెప్పాడట దిల్ రాజు. దీంతో చేసేది లేక రాజ్ తరుణ్ బదులు నాని  హీరోగా సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి .. ఈ సినిమా నాని చేయడం వల్లే హిట్ అయ్యిందని, రాజ్ తరుణ్ చేస్తే ఓకే అనిపించినా ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి కాదని సినీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి దిల్ రాజు వేసిన అంచనా వర్కౌట్ అయ్యిందని అనుకుంటున్నారు.