దినకరన్ పొలిటికల్ ఇన్నింగ్స్ కు తెర

0
60

Posted April 26, 2017 at 11:51

dinakaran arrested by police AIADMK symbol caseశశికళ అక్క కొడుకుగా అన్నాడీఎంకేలో చక్రం తిప్పాలనుకున్న టీటీవీ దినకరన్ కథకు.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ క్లైమాక్స్ పంచ్ ఇచ్చింది. నాలుగు రోజుల పాటు విచారణ పేరుతో ఢిల్లీ చాణక్యపురిలో గంటల తరబడి దినకరన్ ను ప్రశ్నించిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రెండాకుల గుర్తు కోసం ఈసీకే లంచం ఆఫర్ చేయబోయిన కేసు.. దినకరన్ మెడకు గట్టిగానే చుట్టుకుంది. దినకరన్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని కోర్టు నిలదీయటం వెంటనే అరెస్ట్ కు దారితీసింది.

ఇటు దినకరన్ అరెస్ట్ తో తమిళనాడులో పరిణామాలు వేగంగా మారిపోయే ఛాన్స్ ఉంది. దినకరన్ అరెస్ట్ తర్వాత విలీన చర్చలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. మరోవైపు దినకరన్ అరెస్ట్ బీజేపీ, సెల్వం కుట్రని ఆయన వర్గం ఆరోపిస్తోంది. కానీ ఎవరేమన్నా ఇప్పుడు దినకరన్ బయటకు వచ్చే ఛాన్సే లేదు. దీంతో పళనిస్వామికి పన్నీర్ కొత్త డిమాండ్లు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది చెన్నై వర్గాల మాట.

అటు కేంద్రం గేమ్ కూడా ఆసక్తికరంగా మారింది. వ్యూహాత్మకంగా శశికళను రేస్ నుంచి తప్పించిన కేంద్రం.. అదే అరెస్ట్ అస్త్రంతో దినకరన్ ను కూడా పక్కకు తప్పించింది. దీంతో శశికళ ఫ్యామిలీ నుంచి ఎవరు ఎక్స్ ట్రాలు చేసినా సహించేది లేదని మోడీ సర్కారు వార్నింగ్ ఇచ్చినట్లైంది. ఇలాంటి పరిస్థితుల్లో పళని ముందు కూడా ఎక్కువ ఆప్షన్లు లేవని, త్వరగా పన్నీర్ తో రాజీకి రావడమే బెటరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.