బాబు గాంధీ మహాత్ముడా?దేశం ఎంపీ ప్రశ్న

Posted December 20, 2016

divakar reddy about babu
పార్టీ మారినా జేసీ దివాకర్ రెడ్డి నోటిదూకుడు తగ్గలేదు.కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఎవరిని ఏమైనా అనొచ్చు …అంటూనే పార్టీలో కొనసాగొచ్చు.అదే వ్యవహారం కొనసాగిస్తూ టీడీపీ కి జేసీ తెస్తున్న తలనొప్పులు అన్నీఇన్నీ కావు.మొదటి నుంచి పార్టీలో ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడానికి ఏ మాత్రం అయన వెనుకాడరు.ఇప్పుడు ఆ నోటి దూకుడు పరిధి దాటింది.ఈసారి ఏకంగా టీడీపీ అధినేత,రాష్ట్ర సీఎం చంద్రబాబునే ఆయన తీసిపారేసినట్టు మాట్లాడారు.
2014 ఎన్నికల్లో కేవలం చంద్రబాబుని చూసి టీడీపీ అధికారంలోకి వచ్చిందనడం నిజం కాదన్నారు జేసీ.పైగా ఆయనేమన్నా గాంధీ మహాత్ముడా పిలవగానే జనం రావడానికి అంటూ ఎదురు ప్రశ్నించారు.జగన్ అధికారంలోకి వస్తే మంచిది కాదనే తాము టీడీపీ లోకి అప్పడు పరిస్థితుల్ని బట్టి వచినట్టు జేసీ స్పష్టం చేశారు.సీఎం చంద్రబాబు అధికారులతో పాలన చేస్తున్నారని …అది మంచిది కాదని జేసీ అభిప్రాయపడ్డారు.అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తో వైరం వచ్చినపుడు బాబు తమ కొమ్ముకాయలేదని జేసీ ఆగ్రహంగా వున్నారు.అదే ఇప్పుడు మాటల రూపంలో వచ్చిందో లేక వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి దూరం కావాలనుకొని బాబుని రెచ్చగొడుతున్నారో ? ఏదేమైనా ఓ ప్రాంతీయ పార్టీలో అధినేతని ఈ స్థాయిలో తీసిపారేసిన నాయకుడు జేసీ నే ..