డీజే ప్రీ లుక్ వచ్చిసిందోచ్..!!

 Posted February 16, 2017

dj prelook is outవరుస విజయాలతో కలెక్షన్లను కుమ్మేస్తున్న అల్లుఅర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా దువ్వాడ జగన్నాధం. బన్నీ ఇమేజ్ కి తగ్గట్టుగానే దర్శకుడు హరీశ్ శంకర్ ఈ డీజే మూవీని తెరకెక్కిస్తున్నాడు. డీజే సినిమాలో తమ అభిమన హీరో బన్నీ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. ఆ రిలీజ్ కి రెండు రోజుల సమయం ఉంది. ఈ లోగా ఆ ఫస్ట్ లుక్ పై మరింత ఆసక్తి పెంచేందుకు హరీశ్ ప్రీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు.

ఈ మూవీ లో బన్నీ బ్రాహ్మణ కుర్రాడి పాత్రను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా విడుదల చేసిన ప్రీ  లుక్ లో రుద్రక్షతో కూడిన తాడు కనిపించడంతో బన్నీ బ్రాహ్మణ లుక్ లో కనిపించడం కన్ఫామ్  అనుకుంటున్నారు. మరి బన్నీ ఏ లుక్ లో దర్శనమిస్తాడో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.