సుజీత్‌కు అంత సీన్‌ ఉందా.. నిలిపేనా?

0
119

Posted May 11, 2017 at 19:19

does sujith can handle sahoo
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం ఆకాశమే హద్దుగా పెరిగి పోయింది. రెండు పార్ట్‌లు కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్‌ తర్వాత సినిమాపై చర్చ తారా స్థాయిలో జరుగుతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభాస్‌తో సినిమా చేసేందుకు యువ దర్శకుడు సుజీత్‌ ఎదురు చూస్తున్నాడు. షార్ట్‌ ఫిల్మ్‌లను తెరకెక్కించే సుజీత్‌ ఆ మద్య ‘రన్‌ రాజా రన్‌’ చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఇప్పుడు ‘బాహుబలి’ ప్రభాస్‌తో ‘సాహో’ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం, అది కూడా సక్సెస్‌ కాలేదు. ఇక వయస్సు చాలా చిన్న, ఇలాంటి సుజిత్‌ ప్రస్తుతం ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ స్టార్‌ అయిన ప్రభాస్‌తో సినిమా చేసి మెప్పించగలడా, అస్సలు ప్రభాస్‌ క్రేజ్‌ను సుజీత్‌ కాపాడగలడా అనేది ప్రస్తుతం అందరి అనుమానం. ‘బాహుబలి’ అంతటి స్థాయి సినిమా అంటే ఏ ఒక్కరి వల్ల కాదు. కాని ఆ సినిమా వల్ల వచ్చిన క్రేజ్‌ ‘సాహో’ అట్టప్‌ ఫ్లాప్‌ అయితే పోతుంది. కనీసం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటేనే ‘బాహుబలి’ ఫలితం ‘సాహో’కు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. కాని సుజీత్‌ ఎలా ప్రభాస్‌ను చూపుతాడు అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో సుజీత్‌ ‘సాహో’ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. బడ్జెట్‌ సరే కాని సినిమాలో కంటేంట్‌ గురించే అందరికి భయం.