మోడీ స్ట్రైక్స్ ఇప్పట్లో ఆగవా?

Posted November 13, 2016500 , 1000 నోట్ల రద్దుతో బ్లాక్ కోబ్రా లకి షాక్ ఇచ్చిన ప్రధాని మోడీ మరో బాంబు పేల్చేందుకు రెడీ అవుతున్నారు.జపాన్ పర్యటనలో ఉన్న అయన దీనిపై తొలిసారి నోరు విప్పారు. నల్ల ధనాన్ని బయటికి రప్పించడానికి అవసరమైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్కలు చూస్తామని చెప్పి తాజా ప్రకటన ఆషామాషీ వ్యవహారం కాదన్న సంకేతాలు ఇచ్చారు.నల్లధన వెల్లడి కోసం కేంద్రం పధకం తెచ్చినా ఎక్కువమంది దాన్ని లెక్క చేయకుండా వ్యవహరించడాన్ని మోడీ తప్పుబట్టారు.

ఇప్పటికే బ్యాంకు లాకర్ల మీద దాడులు జరగొచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.ఇప్పుడు మోడీ హెచ్చరికలు చూస్తుంటే తాజా నిర్ణయం తర్వాత బ్లాక్ మనీ బయటికి తీసుకురావడానికి మరి కొన్ని చర్యలు తప్పేట్టు లేవు.అయితే అది అందరూ ఊహించినట్టు ఉండబోదని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు కొందరు ఊహిస్తున్నారు.కేంద్రం వారికి చేయాల్సిన పనేమిటో చెప్పకుండా పెద్దఎత్తున ఉద్యోగుల్ని సిద్ధం చేసుకోమని చెప్పినట్టు ఓ సమాచారం.ఇదంతా చూస్తుంటే మోడీ స్ట్రైక్స్ ఇప్పట్లో ఆగవని అనుకోవాలి.