పెళ్లి డబ్బు డ్రా చేయటం అంత ఈజీ కాదు

Posted November 22, 2016

drawing wedding expences from bank is not easy
నల్లధనం బైటకు రావడం సంగతలా ఉంచి సామాన్యులకష్టాలు అంత ఇంత కాదు ,కేంద్రం తాజాగా నగదు విత్ డ్రా కు సంబంధించి సడలింపుఇచ్చినా బ్యాంకు లు వద్ద క్యూలేమీ తగ్గలేదు . సరికదా కొత్తగా నగదు పరిమితి పై ఆంక్షలు వాళ్ళ ఇంకా ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళికి ఖర్చుల కోసం రెండున్నర లక్షల వరకు తీసుకోవచ్చు అని వున్నా బ్యాంకుల్లో ఆ పరిస్థితి లేదు .
పెళ్లిళ్లకు రూ. 2.5 లక్షల విత్‌డ్రాకు సంబంధించి ఆర్‌బీఐ సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
1. నవంబర్ 8కి ముందు ఖాతాలో ఉన్న మొత్తం నుంచే నగదు తీసుకోవాలి.
2. డిసెంబర్ 30 అంతకంటే ముందు జరిగే వివాహాలకు మాత్రమే బ్యాంకులు రూ.2.5 లక్షలు చెల్లించాలి.తల్లి లేదా తండ్రి లేదా పెళ్లి చేసుకునే వ్యక్తి… ఎవరో ఒకరి ఖాతా నుంచి మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవాలి.
3. బ్యాంకు ఖాతాలేనివారికి మాత్రమే నగదు ద్వారా చెల్లింపులు జరపాలి. నగదు విత్‌డ్రా చేసుకునే వ్యక్తి ఆ డబ్బును పెళ్లి ఖర్చు కోసం ఎవరెవరికి చెల్లిస్తున్నారో తెలుపుతూ బ్యాంకుకు జాబితా సమర్పించాలి.
4. పెళ్లి ఖర్చు చెల్లించే వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకపోతే వారి నుంచి డిక్లరేషన్ తీసుకుని బ్యాంకుకు ఇవ్వాలి. దేనికోసం ఎంత ఖర్చుపెడుతున్నారో జాబితాలో తప్పకుండా పేర్కొనాలి.
5. పెళ్లి ఖర్చును నగదు రహిత మార్గాలైన చెక్కులు, డ్రాప్టులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెరుుడ్ కార్డులు, మొబైల్ ట్రాన్‌‌స ఫర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా జరిగేలా బ్యాంకులు ప్రోత్సహించాలి.
6. విత్‌డ్రాకు చెందిన అన్ని వివరాల్ని సాక్ష్యాల కోసం బ్యాంకులు కచ్చితంగా నమోదు చేయాలి. అవసరమైతే వివరాలు సరిచూసుకునేందుకు ఉన్నతాధికారులకు ఆ వివరాలు సమర్పించాలి.
7. వివాహ ఆహ్వాన పత్రిక, కళ్యాణ మండపం, కేటరింగ్‌కు ముందస్తు అడ్వాన్స్ రశీదులు జతపరచాలి.
పెళ్లిళ్లు జరిగే కుటుంబాలు రూ. 2.5 లక్షల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చంటూ గతవారం కేంద్రం ప్రకటించినా… ఆ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు.