మహానటి సావిత్రి భర్త ఖరారు.. ఇది తెలివైన ఎంపిక!

0
89

Posted April 24, 2017 at 13:16

dulquer salmaan play savitri husband role in savitri biopic
మహానటి సావిత్రి జీవితం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను అతి త్వరలోనే సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్‌ వేస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులు మెల్ల మెల్లగా అన్ని విషయాలు రివీల్‌ చేస్తున్నారు. మహానటి పాత్రలో కీర్తి సురేష్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఇక ముఖ్యమైన జర్నలిస్ట్‌ పాత్రలో సమంత నటించబోతుంది. సినిమాకు చాలా కీలకం అయిన మహానటి భర్త జెమిని గణేషన్‌ భర్త పాత్రను ఎవరు చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళ స్టార్‌ హీరో అయిన జెమిని గణేషన్‌ పాత్రను మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో చేయించాలని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్ణయించుకున్నాడు. మొదట ఈ సినిమాను సూర్యతో చేయించాలని భావించారు. అయితే జెమిని గణేషన్‌ను విలన్‌గా చూపించే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో పాటు, మూడు పెళ్లిలు చేసుకున్న జెమిని గణేషన్‌ పాత్రలో నటించేందుకు సూర్య ఆసక్తి చూపించలేదు. దాంతో మలయాళ స్టార్‌ దుల్కర్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికతో ‘మహానటి’ సినిమాకు మలయాళంలో కూడా భారీ క్రేజ్‌ రావడం ఖాయం. తెలుగు, తమిళం, మలయాళంలో ఈ సినిమా భారీగా విడుదల అయ్యేందుకు ఛాన్స్‌ ఉంది. అనుష్క, ప్రకాష్‌ రాజ్‌లతో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు కూడా గెస్ట్‌ పాత్రల్లో కనిపించే అవకాశాలున్నాయి. ఇదే సంవత్సరం చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు పట్టుదలతో ఉన్నాడు.