ఆప్ కి ఈసీ సెగ…

 Posted November 2, 2016

ec send notices on another 27 AAP mlasకేంద్ర ఎన్నికల కమిషన్ 27 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరింది. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లాభోపేతమైన ఛైర్మన్ పదవులు చేపట్టడం చట్ట వ్యతిరేకమంటూ కొందరు ఫిర్యాదు చేశారు. జూన్ నెలలో రాష్ట్రపతి భవన్‌కు అందిన ఓ అనర్హత పిటిషన్‌ను ఆ కార్యాలయం గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. దీనిపై స్పందించిన ఈసీ, అనర్హత పిటిషన్ పై ఈనెల 11లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ 27 మంది ఆప్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది.