ఖైది సెట్స్ లో కన్నీళ్లు పెట్టాడా..!

Posted November 12, 2016

jj1ఖైది సెట్స్ లో ఎన్నో అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. తెలుగు సినిమాకు బ్రేక్ డ్యాన్స్ రుచి చూపించిన చిరు.. ఆ స్టెప్పులు ఆయనే వేయాలి వేయగలడు అన్న రీతిలో ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అయితే చిరంజీవిని చూసి డ్యాన్స్ నేర్చుకుని ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్స్ అయిన వారు ఎంతోమంది. ప్రస్తుతం చిరుకి స్టెప్స్ నేర్పిస్తున్న జాని మాస్టర్ కూడా చిరుకి పెద్ద అభిమానే. ఖైది నెంబర్ 150 లో ఓ సాంగ్ కోసం జాని మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు.

ఇక చిరు స్టెప్పులు చూస్తూ పెరిగిన తను చిరుకి డ్యాన్స్ కంపోజ్ చేయడం పట్ల సంతోషాన్ని ఆపబట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నాడట. నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.. మెగాస్టార్ స్టెప్పులని చూస్తూ పెరిగిన నేను ఆయనకు డ్యాన్స్ కంపోజ్ చేయడం అద్భుతమైన ఫీలింగ్ అని జాని మాస్టర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

మెగాస్టార్ కు డ్యాన్స్ కంపోజ్ చేయడంలో ఉన్న కిక్ ఎంజాయ్ చేస్తున్న జాని మాస్టర్ ఈ సాంగ్ తో తన కంపోజిషన్ అంటే ఏంటో రుచి చూపించాలని చూస్తున్నాడు. మెగా హీరోలకు ముఖ్యంగా చెర్రికి అన్ని సినిమాలు చేస్తున్న జాని మాస్టర్ మెగాస్టార్ కు కంపోజ్ చేస్తున్న సాంగ్ లో తన ప్రతిభ మొత్తం పెట్టేస్తున్నాడు. మరి అభిమాని కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.