డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలి ..కమిటీ కన్వీనర్ చంద్రబాబు

Posted December 3, 2016

భారతదేశాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దాలి. బ్యాంకర్లదే కీలకపాత్ర’ అని సీఎం వ్యాఖ్యానించారు.డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఏర్పాటైన కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో సమావేశమవుతుందని సమన్వయ కమిటీ కన్వీనర్‌ అయిన చంద్రబాబు చెప్పారు పెద్ద నోట్ల రద్దు అనంతరం పరిణామాలపై శుక్రవారం చైర్మన్లు, సీఎండీలు, ఆర్‌బీఐ అధికారులతో సీఎం విజయవాడ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిజిటల్‌ విధానంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యాష్‌ హ్యాండ్లింగ్‌ చార్జీలను రద్దు చేయడానికి బ్యాంకర్లు అంగీకరించారు.

డిసెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఈ-పోస్‌ లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించాలని, పెట్రోల్ బ్యాంకుల్లో ప్రీ పైడ్ కార్డ్స్ వాడాలని ,పౌరసరఫరాల శాఖ పరిధిలోని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఆధార్‌ కార్డు ఆధారిత నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రజలకు రేషన్‌ సరుకులు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని సీఎం అందుకు తగిన ఏర్పాలను చేయాలనీ సూచించారు నగదు రహిత లావా దేవీలపై ప్రజల్లో అవగాహనా కల్పించాలని సూచించారు ..

[wpdevart_youtube]1SKOuLkmuyA[/wpdevart_youtube]