ఒక్క మీటింగ్ తో క‌ష్టాల్లో ఎర్ర‌బెల్లి!!

Posted February 5, 2017

erraballi into troubles
టీడీపీ ఫ్లోర్ లీడ‌ర్ గా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు… ఒక్క‌సారిగా టీఆర్ఎస్ లో జాయినైపోయి అంద‌రికీ షాకిచ్చారు. మంత్రిపద‌వి కోస‌మే ఆయ‌న పార్టీ మారార‌ని అప్ప‌ట్లో ఊహాగానాలు వ‌చ్చాయి. అటు టీఆర్ఎస్ నుంచి కూడా అలాంటి లీకులు వ‌చ్చాయి. కానీ ఎందుక‌నో ఆయ‌నకు మాత్రం మినిస్ట్రీ రాలేదు. దీంతో ఇన్నాళ్లూ వేచిచూసిన ఎర్ర‌బెల్లి … ఇక దానిపై ఆశ‌లు వ‌దిలేసుకున్నార‌ట‌. అందుకే ఇక టీఆర్ఎస్ కు దూరం పాటించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని టాక్.

ఎర్ర‌బెల్లి టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో…. ఆయ‌న ఏకంగా టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌ను క‌లిశారు. ఈ మ‌ధ్యే ఈ భేటీ జ‌రిగింద‌ట‌. అయితే అప్పుడు విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. చివ‌ర‌కు అటు తిరిగి ఇటు రేవంత్ రెడ్డి దృష్టికి విష‌యం వెళ్ల‌డంతో… ఆయ‌న మీడియా చెవిన వేశారు. దీంతో ఎర్ర‌బెల్లి ఒక్క‌సారిగా డిఫెన్స్ లో ప‌డిపోయారు. ర‌మ‌ణ‌తో త‌న స్నేహం పార్టీల‌క‌తీత‌మైందంటూ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది.

మొత్తానికి ర‌మ‌ణ‌తో భేటీ కావ‌డంపై టీఆర్ఎస్ లోనూ ఎర్రబెల్లిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నారు. కొంప‌దీసి ఈయ‌న పార్టీ ఏమైనా మారుతాడా అని డౌట్స్ వ‌స్తున్నాయి. అయితే ఎర్ర‌బెల్లి మాత్రం తాను టీడీపీలోకి వెళ్ల‌బోన‌ని… టీఆర్ఎస్ లోనే ఉంటాన‌ని చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప‌క్క పార్టీ అధ్య‌క్షుడితో భేటీ అయితే.. ఇలాంటి పుకార్లు రాకుండా ఎలా ఉంటాయి. మొత్తానికి ఈ ఒక్క మీటింగ్ ఎర్ర‌బెల్లికి ఎన్నో క‌ష్టాల‌ను తెచ్చిపెడుతోంది. అడిగిన వారంద‌రికీ ఆన్స‌ర్ చెప్ప‌డానికి ఆయ‌న ఇప్పుడు తెగ ఇబ్బంది ప‌డుతున్నారు.