అక్కడ టాబ్ చూసి పరీక్ష రాయొచ్చట…

Posted November 29, 2016

పరీక్ష హాల్లోకి పెన్ను ,పెనిసిల్ ,స్కేల్ మినహా మరే ఇతర ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులు తెచ్చినా పరీక్ష కు అనుమతించం అని మనం సర్వ సాధారణం గా వినే హెచ్చరిక. ఐతే ఇక పై ఈ హెచ్చరిక వినే అవకాశం ఉండదేమో. ఎందుకంటె సాంకేతికతను విద్యార్థులకు అలవాటు చేయాలని ఉద్దేశ్యం తో ఎలక్ట్రానిక్ టాబ్ ల ద్వారా పరీక్ష రాసేందుకు అనుమతించారు ఆ కళాశాల యాజమాన్యం. బెంగళూరు లోని మహారాణి లక్ష్మి అమ్మణ్ణి గవర్నమెంట్ కళాశాల లోని విద్యార్థినిలు టాబ్ వాడుతూ ఎక్జామ్ రాస్తున్నారు ప్రతి పరీక్షల్లోనూ వీటి వాడకం తప్పనిసరి!బెంగళూరు విశ్వవిద్యాలయం పరిధిలోని ఈ కళాశాలకు ఇప్పటికే స్వయం ప్రతిపత్తి ఉంది. భారతీయ రాజ్యాంగం, మానవహక్కులు అనే అంశమై నిర్వహించిన పరీక్షలో అన్నీ ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలే ఉంటాయి. ప్రశ్న పత్రికను చూసి, దానికి సమాధానాల్ని ట్యాబ్‌పై నమోదు చేయాలి. సాంకేతికతను వినియోగించుకునే అంశమై విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు.

Image result for maharani lakshmi ammanni college bangalore