బతికున్నవాళ్లను ఫేస్‌బుక్‌ చంపేసింది..

Posted November 15, 2016
Facebook apologies after error kills off millions of usersఫేస్‌బుక్‌ లేని సోషల్‌మీడియాని ఊహించలేని స్థితిలో మనతో మమేకమైపోయింది. అలాంటి బలమైన మాధ్యమం తలుచుకుంటే క్షణాల్లో ఎంతమైన చంపగలదని నిరూపణ అయ్యింది. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలల్లో చంపేసింది. చివరకు దాని వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా చంపేసింది. అదేంటి అనుకుంటున్నారా.. బతికున్న చాలా మందిని చనిపోయినట్లు చూపిస్తూ వారి స్మృతుల గురించి సందేశం కూడా ఉంచింది. ఇటీవల ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక భయంకరమైన ఎర్రర్‌ మూలానా వేల ఖాతాల్లో ఆటోమేటిగ్గా జనరేట్‌ అయ్యింది. ఆయా ఖాతాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చాలా మంది ప్రముఖులు ఉండటం గమనార్హం.. దీంతో ‘నేను చచ్చిపోయా.. నన్ను ఫేస్‌బుక్‌ చంపేసింది’ అంటూ సరదా ట్వీట్లతో హోరెత్తించారు. దీనిపై మార్క్‌ స్పందిస్తూ సాంకేతిక తప్పిదంతో ఇలా జరిగిందని వెంటనే దాన్ని సరిదిద్దినట్లు ప్రకటించి.. దీని వల్ల ఆవేదనకు గురైన అందరికి క్షమాపణలు చెప్పాడు..