భార్యతో విడాకులు తీసుకున్న హీరో…!

0
97

Posted April 26, 2017 at 18:51

farhan akhtar adhuna bhabani get legally divorcedప్రేమించుకోవడం సహజీవనం చేయడం తర్వాత విడిపోవడం బాలీవుడ్ లో చాలా కామన్ అయిపొయింది.. అదేవిధంగా ఇప్పుడు బాలీవుడ్ లో విడాకుల హంగామా కూడా ఎక్కువవుతూనే ఉంది. స్టార్ హీరో హృతిక్ రోషన్ పెళ్లి విడాకులకు దారి తీయడం చూశాం. అలాగే మలైకా అరోరా పెళ్లి కూడా అలానే ముగిసింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకున్నారు.

బాలీవుడ్ స్టార్ట్ హీరో- డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫరాన్ అక్తర్, తన భార్య అధునా భబాని తో విడాకుల కోసం కోర్ట్ మెట్లేక్కాడు. ఫరాన్ అక్తర్ తన భార్య అధునా భబాని తో పదహారు ఏళ్ళు కలిసి ఉన్నారు.. తర్వాత ఏమైందో ఏమోగాని వీళ్ళిద్దరూ విడిగా ఉండటం ప్రారంభించారు.ఈ బ్రేకప్ కి కారణాలు పెద్దగా తెలీయవు కానీ వీళ్ళిద్దరూ విడిపోవటానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ముంబై కోర్ట్ వీరికి అధికారకంగా విడాకులు మంజూరుచేసింది .

వీళ్ళిద్దరకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాక్య మరియు అకీర తల్లి దగ్గర ఉండాలి అని, ఫరాన్ తన పిల్లలని ఎప్పుడైనా కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వీరి వివాహం 2000 సంవత్సరంలో జరిగింది.