తండ్రీకొడుకుల సవాల్!!

Posted December 30, 2016

father and son betting
యూపీ అధికార పార్టీ ఎస్పీలో జరుగుతోంది చూస్తే బాప్ ఏక్ నెంబరీ.. బేటా దస్ నెంబరీ అన్న సామెత గుర్తుకొస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అఖిలేశ్ ఏం చెప్పినా.. దానికి అపోజిట్ గా చేస్తున్నారు ములాయం సింగ్ యాదవ్. ఇక ములాయం ఒకటంటే.. అఖిలేశ్ మరోలా అర్థం చేసుకుంటున్నారు. ఇలా మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య ఫ్యామిలీవార్ తీవ్రమైంది.

యూపీలో మొత్తం 403 సీట్లకు గాను 325 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు ములాయం. ఇందులో అఖిలేశ్ కు కూడా సీటివ్వలేదు. తాను చెప్పిన పేర్లన్నీ లిస్టులో గల్లంతయిపోవడంతో సీఎం గారికి కోపమొచ్చిందట. కనీసం తనకైనా సీటు ఇస్తారా లేదా అని తండ్రిని అడిగారని సమాచారం. అయితే అది కొన్ని రోజుల తర్వాత గానీ తేలదు అని గట్టిగా చెప్పారట ములాయం.

403 స్థానాల్లో ఇప్పటికే 325 మంది అభ్యర్థులు ఫైనల్ అయిపోయారు కాబట్టి.. ఇక తేలాల్సింది పొత్తు ఉంటుందా.. లేదా అన్నదే. అయితే ఎవరితోనూ పొత్తు ఉండదని ఆయన చెప్పినప్పటికీ కాంగ్రెస్ తో పొత్తు కోసం ఆస్థానాలను బ్యాలెన్స్ గా ఉంచారట. కాబట్టి ఇక అఖిలేశ్ వర్గానికి సీట్లు దొరికే ఛాన్సులే లేవని స్పష్టమైపోయింది. దీంతో సీఎం సారు కూడా తండ్రికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యాడని టాక్. తన వర్గం మొత్తాన్ని రెబెల్స్ గా దించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే 167 మందితో అఖిలేశ్ ఓ జాబితాను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎస్పీ కథ అయోమయం..జగన్నాథం అవుతుందని క్యాడర్ భయపడుతున్నారు.