తండ్రీకొడుకులది రచ్చా…రాజకీయమా?

Posted January 2, 2017

father and son fight or politics
దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి ఉత్తర ప్రదేశ్ లో తండ్రీకొడుకుల మధ్య రోజుకో రచ్చ మామూలైపోయింది.కానీ ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా పరిశీలిస్తే పరిస్థితి వేడెక్కిన ప్రతిసారి చల్లబడుతూనే వుంది.ఊహించని గొడవలు ఊహించే పరిష్కారాలతో ఓ కొలిక్కి వస్తున్నాయి.ఓ విధంగా చెప్పాలంటే పార్టీ తండ్రి చేతి నుంచి కొడుకు చేతికి ట్రాన్సఫర్ అయిపోయింది.అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ అధికార మార్పిడి మాములుగా జరిగితే అది వారసత్వ వ్యవహారం అయ్యేది .కానీ ఇప్పుడు అధికారం మారింది ..అది కూడా తండ్రికి వ్యతిరేకంగా కొడుకు పోరాడి సాధించుకున్నాడు.పార్టీ శ్రేణులు ప్రజలు తాజాగా అఖిలేష్ నాయకత్వాన్ని సంపూర్ణంగా స్వాగతించే పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామాల్ని దగ్గరగా చూస్తున్న ఓ రాజకీయ పరిశీలకుడు భలే డౌట్ వ్యక్తపరిచారు. పైకి తండ్రీకొడుకుల మధ్య జరిగింది రచ్చలా కనిపిస్తున్నా అది అసలుసిసలు రాజకీయమంటున్నారు. సమాజ్ వాది లో ఈ గొడవలు మొదలుకాకముందు చూస్తే యూపీ లో శాంతిభద్రతల పరిస్థితి, అఖిలేష్ అనుభవ రాహిత్యం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది.గొడవ పూర్తి అయ్యి అఖిలేష్ కి సమాజ్ వాదీ పగ్గాలు అందేసరికి అతను యువతరానికి ,సరికొత్త స్వచ్ఛ రాజకీయాలకు ప్రతినిధిగా ఆవిర్భవించాడు.పైగా ఈ రాజకీయ వేడి ప్రతిపక్షాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా కట్టిపడేసింది.ఒకప్పుడు రేసులోనే లేదనుకున్న పార్టీ ఇప్పుడు అఖిలేష్ సారధ్యంలో గట్టి పోటీదారుగా అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.ములాయం తన చుట్టూ వున్నవారికోసం ఉత్తుత్తి యుద్ధం చేసి తాను అనుకున్నట్టే కొడుక్కి విజయవంతంగా అధికార మార్పిడి చేశాడు. ఇప్పుడు చెప్పండి తండ్రీకొడుకుల మధ్య జరిగింది రచ్చా …రాజకీయమా?